ప్చ్.. బోపన్నకు నిరాశ!
ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరోసారి భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న టోర్నీ నుంచి వెనుదిరిగాడు. బెన్ మెక్లాహన్తో కలిసి పురుషుల డబుల్స్‌లో పాల్గొన్న అతడు...
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరోసారి భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న టోర్నీ నుంచి వెనుదిరిగాడు. బెన్ మెక్లాహన్తో కలిసి పురుషుల డబుల్స్‌లో పాల్గొన్న అతడు.. తొలి రౌండ్లో సుంగ్ నమ్-మిన్ క్యు జంట చేతిలో 4-6, 6-7 తేడాతో ఓటమిపాలయ్యాడు. గంట 17 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్లో బోపన్న జోడీ తేలిపోయింది. అయితే రెండో సెట్లో ప్రతిఘటించినప్పటికీ ఓటమి తప్పలేదు.
కఠిన క్వారంటైన్ నిబంధనల కారణంగా ప్రాక్టీస్‌కు తక్కువ సమయం లభించడం బోపన్న ఆటపై ప్రభావం చూపింది. భారత యువ ఆటగాడు సుమిత్ నగాల్ కూడా తొలి రౌండ్లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. నగాల్ 2-6, 5-7, 3-6తో రికార్డాస్ బెరాంకీస్ (లిథుయేనియా) చేతిలో ఓడాడు. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత ఆటగాళ్లు దివిజ్ శరన్ (పురుషుల డబుల్స్), అంకిత రైనా (మహిళల డబుల్స్) పోరాటం మిగిలి ఉంది.
ఇదీ చదవండి
నగాల్ ఔట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.