Umran Malik : ఉమ్రాన్‌ మాలిక్‌ను చూస్తే ఆ మాజీ పేసర్‌ గుర్తుకొస్తాడు: బ్రయాన్‌ లారా

టీ20 లీగ్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌ హైదరాబాద్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్. ప్రస్తుత సీజన్‌లో గంటకు 157 కి.మీ వేగంతో బంతిని ...

Published : 22 May 2022 02:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌ హైదరాబాద్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్. ప్రస్తుత సీజన్‌లో గంటకు 157 కి.మీ వేగంతో బంతిని సంధించాడు. ప్రస్తుత సీజన్లో 13 మ్యాచులకు గాను 21 వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్‌పై హైదరాబాద్ బ్యాటింగ్‌ కోచ్, విండీస్‌ మాజీ బ్యాటర్ బ్రయాన్‌ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. ఉమ్రాన్‌ బౌలింగ్‌ను చూస్తే తనకు విండీస్‌ మాజీ పేసర్‌ ఫిడేల్ ఎడ్వర్డ్స్ గుర్తుకొస్తాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘‘ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ శైలిని, స్పీడ్‌ను చూస్తే నాకు వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ ఫిడేల్ ఎడ్వర్డ్స్‌ గుర్తుకొస్తాడు. ఫిడేల్‌ తన కెరీర్‌ ఆరంభంలో చాలా పేస్‌తో బౌలింగ్‌ చేసేవాడు. అలానే ఉమ్రాన్‌ కూడా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెడతాడని భావిస్తున్నా’’ అని బ్రయాన్ లారా పేర్కొన్నాడు. ఇదే అభిప్రాయాన్ని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి కూడా వెల్లడించాడు. ‘ఉమ్రాన్‌ను కీలక ప్లేయర్లతో కలిపి ఆడించాలి. షమీ, బుమ్రా వంటి ఆటగాళ్ల నుంచి నేర్చుకుంటాడు. వారు తమ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారో తెలియజేస్తారు. మేనేజ్‌మెంట్, సపోర్ట్‌ సిబ్బంది ఎలానూ ఉంటారు. అందుకే అతడిని తప్పుదారి పట్టించకుండా.. టాప్‌ ఆటగాళ్లతో మిక్స్‌ చేయాలి’’ అని రవిశాస్త్రి సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని