T20 World Cup: అరుదైన రికార్డుకు చేరువగా బుమ్రా.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో తీరేనా?
టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇంకో మూడు వికెట్లు పడగొడితే టీ20 మ్యాచుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇంకో మూడు వికెట్లు పడగొడితే టీ20 మ్యాచుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అవుతాడు. ఇవాళ అఫ్గానిస్థాన్‌తో పోరులో బుమ్రా రాణించి రికార్డు సృష్టించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం బుమ్రా 52 టీ20 మ్యాచుల్లో 61 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో బుమ్రా కంటే ముందు చాహల్ ఉన్నాడు. చాహల్ కేవలం 49 టీ20ల్లో 63 వికెట్లను తీశాడు. వీరిద్దరి తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 46 మ్యాచుల్లో 52 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ (50), హార్దిక్ పాండ్య (42) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ తీయని బుమ్రా.. కివీస్ మీద రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అఫ్గాన్ మీద నిప్పులు చెరిగే బంతులను విసిరి ఈ రికార్డును ఖాతాలో వేసుకుంటాడో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 34వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. 2016లో తొలి ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ ఆడిన బుమ్రా అత్యుత్తమ గణాంకాలను (3/11) జింబాబ్వే మీద 2016లో నమోదు చేశాడు. యార్కర్లను సంధించడంలో తిరుగులేని బుమ్రా.. డెత్ ఓవర్లలో ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తాడు.
అంతర్జాతీయంగా చూస్తే అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ టాప్‌లో ఉన్నాడు. 94 మ్యాచుల్లో 117 వికెట్లను పడగొట్టాడు. తర్వాత లసిత్ మలింగ (84 మ్యాచుల్లో 107), రషీద్ ఖాన్ (102) ఉన్నారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ పరంగా.. తాబ్రైజ్ షంసి (దక్షిణాఫ్రికా), వహిందు హసరంగ డిసిల్వా (శ్రీలంక), రషీద్‌ఖాన్ (అఫ్గాన్), అదిల్ రషీద్ (ఇంగ్లాండ్), ముజీబ్ (అఫ్గాన్) టాప్-5లో నిలిచారు. వీరందరూ స్పిన్నర్లే కావడం విశేషం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో టీమ్ఇండియా బౌలర్ ఒక్కరూ లేకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్‌ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్