Kohli - BCCI : సెలక్టర్లు చూసుకుంటారు

తమ సమస్య అని టీమ్‌ ఇండియా కెప్టెన్‌ కోహ్లీ అన్నాడు. ‘‘బ్యాటింగ్‌ విభాగంపై దృష్టి సారించాల్సిందే. ఇలా కుప్పకూలడం మంచిది కాదు. ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. దీనికి ఎలాంటి సాకులు చెప్పకూడదు. దక్షిణాఫ్రికాలో ఆ జట్టును ఓడించాలని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు

Updated : 15 Jan 2022 08:31 IST

బ్యాటింగే తమ సమస్య అని టీమ్‌ ఇండియా కెప్టెన్‌ కోహ్లీ అన్నాడు. ‘‘బ్యాటింగ్‌ విభాగంపై దృష్టి సారించాల్సిందే. ఇలా కుప్పకూలడం మంచిది కాదు. ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. దీనికి ఎలాంటి సాకులు చెప్పకూడదు. దక్షిణాఫ్రికాలో ఆ జట్టును ఓడించాలని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఆ సిరీస్‌ విజయం మా జట్టు ఉత్తమ ప్రదర్శనకు నిదర్శనంగా నిలుస్తుందని అనుకున్నారు. కానీ మేం అది సాధించలేదు. అదే వాస్తవం. దాన్ని ఆమోదించి మెరుగైన క్రికెటర్లుగా తిరిగి బలంగా పుంజుకోవాలి. తొలి టెస్టులో మంచి ఆటతో విజయాన్ని అందుకున్నాం. కానీ ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లోనూ సఫారీ జట్టు కీలక సమయాల్లో బంతితో రాణించింది. మేం సద్వినియోగం చేసుకోలేని పరిస్థితులను ఆ జట్టు చక్కగా ఉపయోగించుకుంది. విజేతగా నిలిచేందుకు ఆ జట్టుకు అర్హత ఉంది. బౌలింగ్‌ పరంగా మాకు ఇబ్బంది లేదు. బ్యాటింగ్‌లోనే సమస్యలున్నాయి.పుజారా, రహానేలకు ఇకపైనా మా మద్దతు కొనసాగుతుంది. టెస్టు క్రికెట్లో భారత్‌కు వాళ్లెంతో చేశారు. అయితే సెలక్టర్లు తీసుకోబోయే నిర్ణయం గురించి నేను ఇక్కడ మాట్లాడను’’ అని కోహ్లీ అన్నాడు.

బయటి వాళ్లకు తెలియదు: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఎల్గర్‌ వివాదాస్పద రీతిలో సమీక్షలో బతికిపోవడంతో తీవ్ర అసహనానికి లోనైన భారత ఆటగాళ్లు ప్రసారదారుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే విమర్శలు వస్తున్నా.. తమ ప్రవర్తన భారత కెప్టెన్‌ కోహ్లి సమర్థించుకున్నాడు. బయట ఉన్న వాళ్లు తాము అలా ఎందుకు స్పందించామో అర్థం చేసుకోలేరని అన్నాడు. ‘‘ఆ విషయానికి సంబంధించి నేను ఇంకేమీ మాట్లాడాలనుకోవట్లేదు. మైదానంలో ఏం జరుగుతుందో మాకే తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుందన్నది బయటి వాళ్లకు సరిగ్గా తెలియదు’’ అని కోహ్లి చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని