IND vs NZ: సమయం వచ్చినప్పుడు శతకం బాదేస్తాను : పుజారా

టీమ్‌ఇండియా ‘టెస్ట్‌ స్పెషలిస్ట్‌’ ఛెతేశ్వర్ పుజారా అర్ధ శతకాలు బాదుతున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా పుజారా ఒక్క శతకం కూడా..

Published : 23 Nov 2021 20:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ‘టెస్ట్‌ స్పెషలిస్ట్‌’ ఛెతేశ్వర్ పుజారా అర్ధ శతకాలు బాదుతున్నా.. వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా పుజారా ఒక్క శతకం కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. త్వరలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతడు ఇటీవల ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు శతకం బాదుతానని, అదేమంత కష్టం కాదని పేర్కొన్నాడు. 

‘టెస్టుల్లో నేను గత కొద్ది కాలంగా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాను. కొన్ని సార్లు అర్ధ శతకాలు చేశాను. ఒక్కోసారి 80,90 పరుగులు చేసినా.. వాటిని శతకాలుగా మలచలేకపోయాను. ప్రస్తుతం, సెంచరీ గురించి నేను ఆలోచించడం లేదు. నా బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నాను. సమయం వచ్చినప్పుడు శతకం బాదుతాను. బ్యాటింగ్‌ చేయగలిగినంత కాలం జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలనుకుంటున్నాను’ అని పుజారా చెప్పాడు. పుజారా చివరి సారిగా 2019 ఆస్ట్రేలియా పర్యటనలో శతకం నమోదు చేశాడు. అప్పటి నుంచి పుజారా ఆడిన 38 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క శతకం కూడా బాదకపోవడం గమనార్హం. త్వరలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లోనైనా పుజారా సెంచరీ చేస్తాడేమో చూడాలి.!

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని