కరోనా బాధితులకు పఠాన్‌ సోదరుల సాయం 

 దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం 4 లక్షల మంది వైరస్‌ బారినపడుతున్నారు. ప్రస్తుతం దేశం వైద్యసేవల పరంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది.

Published : 06 May 2021 01:20 IST


 

ఇంటర్నెట్‌ డెస్క్‌:  దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం 4 లక్షల మంది వైరస్‌ బారినపడుతున్నారు. ప్రస్తుతం దేశం వైద్యసేవల పరంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా బాధితులకు సరైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా క్రీడాలోకం సైతం ముందుకు వస్తోంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్‌, సచిన్ తెందూల్కర్, జయదేవ్ ఉనద్కత్, బ్రెట్‌ లీ, శిఖర్‌ ధావన్‌ లాంటి ఆటగాళ్లు తమకు తోచిన విధంగా సాయం చేశారు. తాజాగా ఈ జాబితాలో ఇర్ఫాన్ పఠాన్‌, యూసుఫ్ పఠాన్‌లు కూడా చేరారు. ఈ సందర్భంగా 
‘‘దేశం కరోనా రెండో దశ  కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలకు సాయం చేయడం మా బాధ్యత. దక్షిణ దిల్లీలోని కరోనా బాధితులకు క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్‌ తరఫున ఉచితంగా ఆహారం అందిస్తాం’’ అని బుధవారం ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని