SureshRaina: ‘పుష్ప రాజ్‌’గా సురేశ్‌ రైనా.. కొనసాగుతోన్న హవా

ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) చిత్రానికి సినీప్రియులే కాదు ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ‘పుష్పరాజ్‌’గా(Pusharaj) బన్నీ నటన...

Updated : 08 Dec 2022 16:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) చిత్రానికి సినీప్రియులే కాదు ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ‘పుష్పరాజ్‌’గా(Pusharaj) బన్నీ నటన, ఆయన బాడీ లాంగ్వేజ్‌, పంచ్‌ డైలాగ్‌లు, మ్యూజిక్‌.. ఇలా ఆ సినిమాలోని చాలా విశేషాలు ప్రతి ఒక్కర్నీ విపరీతంగా ఆకర్షించాయి. ఇందులో భాగంగానే మైదానంలో బ్యాటింగ్‌తో ఎంతోమంది క్రీడాభిమానులను సొంతం చేసుకున్న వార్నర్‌, జడేజా వంటి క్రికెటర్లు ఇటీవల సోషల్‌మీడియా వేదికగా ‘తగ్గేదేలే’ అంటూ నెటిజన్లను ఫిదా చేశారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి భారత మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా వచ్చి చేరారు. తాజాగా ఆయన ‘పుష్పరాజ్‌’ అవతారమెత్తి నెటిజన్ల మదిదోచారు. ‘శ్రీవల్లి’ అంటూ అచ్చు బన్నీలా స్టెప్పులేసి మెప్పించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన ఆయన బన్నీ నటనను మెచ్చుకున్నారు. ‘‘అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ ఇటీవల చూశాను. బ్రదర్‌.. నీ పెర్ఫార్మెన్స్‌ అత్యద్భుతంగా ఉంది. నువ్వు మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. శ్రీవల్లి పాటను.. ఏదో అలా ప్రయత్నించాను’’ అని ఆయన తెలిపారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. ‘సూపర్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరోపక్క యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ఈ పాటకు స్టెప్పులేసిన వీడియో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని