IPL 2021: టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మలి దశలో భాగంగా షార్జా వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) మధ్య ఈ మ్యాచ్‌ జరుగనుంది..

Published : 24 Sep 2021 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మలి దశలో భాగంగా షార్జా వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) మధ్య ఈ మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో భంగపాటుకు గురైన బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే కసితో బరిలోకి దిగుతోంది. మరోవైపు, మలి దశ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ని ఓడించి చెన్నై సూపర్ కింగ్స్‌ జోష్‌తో ముందుకెళ్తోంది.   

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు..

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), గ్లెన్‌ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్‌, టిమ్‌ డేవిడ్‌, వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, మహమ్మద్‌ సిరాజ్‌, యుజువేంద్ర చాహల్‌, నవదీప్‌ సైనీ

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు..

డు ప్లెసిస్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్ కీపర్‌), డ్వేన్‌ బ్రావో, శార్ధూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని