మహీని ఇంత గౌరవించారంటే.. కారణం అదే

టీమ్‌ఇండియా ఫలితాల పట్ల భావోద్వేగపరంగా దూరంగా ఉండటమే ఎంఎస్‌ ధోనీ అత్యంత విజయవంతం అవ్వడానికి కారణమని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. అతడి వ్యవహార శైలి బాగుంటుంది కాబట్టే అందరూ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు....

Updated : 27 Feb 2024 15:17 IST

ధోనీ ఫలితాలతో సంబంధం లేనట్టు ఉండేవాడు: వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఫలితాల పట్ల భావోద్వేగపరంగా దూరంగా ఉండటమే ఎంఎస్‌ ధోనీ అత్యంత విజయవంతం అవ్వడానికి కారణమని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. అతడి వ్యవహార శైలి బాగుంటుంది కాబట్టే అందరూ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో వీవీఎస్‌ మాట్లాడారు.

‘టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించడం ఎవరికైనా కఠిన సవాలేనని నేను భావిస్తాను. ఎందుకంటే అతడిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎంఎస్‌ ధోనీ ఎప్పుడూ ఫలితాల గురించి ఆలోచించడు. భావోద్వేగ పరంగా దూరంగా ఉంటాడు. కేవలం క్రీడాభిమానులే కాదు కోట్లాదిమంది భారతీయుల్లో అతడు ప్రేరణ నింపాడు. అణకువగా ఉంటూ దేశానికి రాయబారిగా నిలిచాడు. ప్రజల్లో మర్యాదపూర్వకంగా ఉండేవాడు. అందుకే అతడిని అంతలా గౌరవిస్తారు’ అని లక్ష్మణ్‌ అన్నారు. ఆగస్టు 15 సాయంత్రం మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 

తన ప్రవర్తన, వ్యవహారశైలితో భవిష్యత్తు క్రికెటర్లకు ధోనీ ఆదర్శంగా నిలిచాడని వీవీఎస్‌ ప్రశంసించారు. ‘క్రికెట్లో సాధించిన ఘనతలను బట్టి అభిమానుల్లో ప్రేమ పుడుతుంది. వ్యవహార శైలి బాగున్నప్పుడు, మర్యాదగా నడుచుకున్నప్పుడు మాత్రమే వారి నుంచి గౌరవం లభిస్తుంది. మహీ వీడ్కోలు పలకగానే సామాజిక మాధ్యమాల్లో స్పందన చూడండి. మాజీ క్రికెటర్లు, అభిమానులే కాదు సినిమా తారలు, సామాజిక వేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సహా అంతా స్పందించారు’ అని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి

IPL 2020: ఎదురు చూపులు నెల రోజులే..

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని