BCCI: టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా దిలీప్‌!

టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా మరోసారి తెలుగువాడికే అవకాశం దక్కింది! వరంగల్‌కు చెందిన టి.దిలీప్‌ టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా ఎంపికైనట్లు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) గురువారం

Updated : 12 Nov 2021 08:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా మరోసారి తెలుగువాడికే అవకాశం దక్కింది! వరంగల్‌కు చెందిన టి.దిలీప్‌ టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా ఎంపికైనట్లు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో హైదరాబాదీ ఆర్‌.శ్రీధర్‌ స్థానంలో ఫీల్డింగ్‌ కోచ్‌గా దిలీప్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. హెచ్‌సీఏ ఎ-డివిజన్‌ లీగ్స్‌లో కాంటినెంటల్‌ సీసీ తరఫున దిలీప్‌ బరిలో దిగాడు. బీసీసీఐ లెవెల్‌-3 కోర్సు పూర్తి చేసిన దిలీప్‌.. 14 ఏళ్ల కోచింగ్‌ కెరీర్‌లో టీమ్‌ఇండియా, ఇండియా అండర్‌-19, ఫస్ట్‌క్లాస్‌ జట్లకు ఫీల్డింగ్‌ శిక్షకుడిగా పని చేశాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియాకు దిలీప్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌.. దిలీప్‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ద్రవిడ్‌ సహచరుడు.. ఇండియా-ఎ, ఇండియా అండర్‌-19 జట్లకు ఫీల్డింగ్‌ కోచ్‌గా పని చేసిన అభయ్‌శర్మను కాదని దిలీప్‌ను ఈ బాధ్యతలకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎన్‌సీఏలో అభయ్‌ సేవలు అవసరమని భావించిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) దిలీప్‌కు ఓటు వేసినట్లు తెలిసింది. దిలీప్‌ ఎంపిక పట్ల హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని