Ben Stokes: క్రికెట్‌కు విరామం ప్రకటించిన ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌

భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్ క్రికెట్‌ నుంచి నిరవధిక ......

Updated : 30 Jul 2021 22:54 IST

లండన్‌: భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్ క్రికెట్‌ నుంచి నిరవధిక విరామం ప్రకటించాడు. అన్ని క్రికెట్‌ ఫార్మాట్లకు గుడ్‌ బై చెబుతున్నట్టు వెల్లడించాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నాలుగో తేదీ నుంచి భారత్, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానున్న వేళ బెన్‌ స్టోక్స్‌ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌ జట్టు సాధించిన అనేక విజయాల్లో ఈ ఈ ఎడమ చేతివాటం ఆటగాడు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని