Published : 08/09/2021 14:00 IST

IND vs ENG: కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది : ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ 

(Photo: Mohammad Shami Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలినా.. రెండో ఇన్నింగ్స్‌లో అనుహ్యంగా పుంజుకుంది. ఊహించని రీతిలో 466 పరుగులు చేసి ఆలౌటైంది. రోహిత్‌ శర్మ(127) శతకం బాదాడు. బౌలర్లు సమష్టిగా రాణించారు. ఈ విజయంతో టీమ్‌ఇండియా.. సిరీస్‌లో 2-1 అధిక్యంతో నిలిచింది.

‘భారత ఆట తీరు.. ముఖ్యంగా విదేశాల్లో ఆ జట్టు చేస్తున్న ప్రదర్శనను ప్రశంసించాలి. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైనా.. తర్వాత నాలుగు రోజులు ఆడిన ఘనత టీమ్‌ఇండియాకే దక్కుతుంది. ఒక దశలో అండర్‌డాగ్స్‌ అయిన జట్టు.. ఆ తర్వాత విజయం సాధించినప్పుడు అందులో కెప్టెన్ కీలకంగా ఉంటాడు’ అని ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ పేర్కొన్నాడు. 

‘విరాట్‌ కోహ్లీ తన జట్టుని అద్భుతంగా నడిపించాడు. జట్టులో యువ క్రికెటర్లు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారు. వీరిని సమస్వయం చేసుకుంటూ చక్కగా ముందుకెళ్లాడు. ఈ టెస్టులో అతడు ఎక్కడా నిరుత్సాహపడలేదు. 191 పరుగులకే జట్టు ఆలౌటైనా కూడా. కోహ్లీ బాడీ లాంగ్వేజ్‌ జట్టులో ప్రతిబింబించింది’అని ఇంజమామ్‌ ప్రశంసించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని