ICC - Ganguly: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన టీమ్ ఇండియా మాజీ స్పిన్..

Updated : 17 Nov 2021 14:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన టీమ్ ఇండియా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే పదవీ కాలం ముగియనుండటంతో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  2012 నుంచి కుంబ్లే క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవిలో కొనసాగుతున్నాడు. ఇప్పటికే మూడు పర్యాయాలు పదవి కాలం పూర్తి కావడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఆ పదవి నుంచి తప్పుకోనున్నాడు. ఐసీసీ గవర్నింగ్ బాడీ ఈ మేరకు బుధవారం (నవంబర్‌ 17) వివరాలు వెల్లడించింది.

‘ఐసీసీ మెన్స్ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టడాన్ని ఆహ్వానిస్తున్నాం. అంతర్జాతీయ మేటి క్రికెటర్లలో ఒకడైన సౌరభ్‌ సేవలను మేం ఉపయోగించుకుంటాం. బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం కూడా మాకు కలిసొస్తుంది. అలాగే, ఇన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలను పెంచేందుకు కృషి చేసిన అనిల్ కుంబ్లే సేవలు మరువలేనివి. డీఆర్ఎస్ విధానం సరిగా అమలయ్యేలా చూడటం, అనుమానాస్పద బౌలింగ్‌ శైలిలపై సరైన నిర్ణయం తీసుకోవడం వంటి విషయాలపై కుంబ్లే కీలకంగా వ్యవహరించాడు’ అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని