గీత మళ్లీ వస్తోంది

టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న స్టార్‌ రెజ్లర్‌ గీత ఫొగాట్‌ పునరాగమనం చేయబోతోంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన గీత...

Published : 21 Mar 2021 07:18 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న స్టార్‌ రెజ్లర్‌ గీత ఫొగాట్‌ పునరాగమనం చేయబోతోంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన గీత.. తర్వాత మ్యాట్‌పై ఎక్కువగా కనబడలేదు. ఆ ఒలింపిక్స్‌ తర్వాత రెండే టోర్నీలు ఆడిన ఆమె.. అదే ఏడాది సహచర రెజ్లర్‌ పవన్‌ను పెళ్లాడి.. 2019లో తల్లయింది. అయితే గత నాలుగేళ్లలో  రెజ్లింగ్‌లో నిబంధనలతో సహా ఎన్నో మార్పులొచ్చిన నేపథ్యంలో గీత పునరాగమనం ఆసక్తిని రేపుతోంది. సోమవారం ఆరంభమయ్యే ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ ట్రయల్స్‌లో 62 కేజీల విభాగంలో సత్తా చాటాలని గీత భావిస్తోంది.  ‘‘రెజ్లింగ్‌  వదిలిపెట్టాలని ఆలోచన ఎప్పుడూ లేదు. ఆరు నెలల నుంచి ఇంట్లో శిక్షణ మొదలుపెట్టా. బిడ్డ పుట్టిన తర్వాత 20-25 కేజీల బరువు తగ్గా’’ అని గీత చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని