Tokyo Olympics: టోక్యో పారాలింపిక్స్‌లో ఐఏఎస్‌

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఓ ఐఏఎస్‌ అధికారి బరిలో నిలిచారు. నొయిడా జిల్లా మెజిస్ట్రేట్‌ సుహాస్‌ యతిరాజ్‌.. పారా బ్యాడ్మింటన్‌లో పోటీపడేందుకు అర్హత సాధించారు. గతంలో ఆసియా పారా బ్యాడ్మింటన్‌లో కాంస్యం గెలిచిన సుహాస్‌.. కరోనా సమయంలో 16 నెలల పాటు సేవలందించారు.

Published : 17 Jul 2021 08:15 IST

దిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఓ ఐఏఎస్‌ అధికారి బరిలో నిలిచారు. నొయిడా జిల్లా మెజిస్ట్రేట్‌ సుహాస్‌ యతిరాజ్‌.. పారా బ్యాడ్మింటన్‌లో పోటీపడేందుకు అర్హత సాధించారు. గతంలో ఆసియా పారా బ్యాడ్మింటన్‌లో కాంస్యం గెలిచిన సుహాస్‌.. కరోనా సమయంలో 16 నెలల పాటు సేవలందించారు. ‘‘నొయిడా జిల్లా మెజిస్ట్రేట్‌గా కరోనా సమయంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నా. కానీ ఈ సమయంలోనూ శిక్షణ మాత్రం ఆపలేదు. త్వరలో జరిగే పారాలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నా’’ అని సుహాస్‌ చెప్పారు. ఆగస్టు 24న టోక్యో పారాలింపిక్స్‌ ప్రారంభమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని