Team India: ద్రవిడ్‌ అంగీకారం ఆశ్చర్యాన్ని కలిగించింది: పాంటింగ్‌

భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవిని చేపట్టడానికి రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు.    ‘‘భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవిని రాహుల్‌

Updated : 19 Nov 2021 06:45 IST

సిడ్నీ:  భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవిని చేపట్టడానికి రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ‘‘భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవిని రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించడం ఆశ్చర్యానికి గురి చేసింది. భారత అండర్‌-19 కోచ్‌గా అతడెంత ఆనందంగా ఉండేవాడో నాకు తెలుసు. అతడి కుటుంబం గురించి తెలియదు. చిన్న పిల్లలు ఉన్నారని అనుకుంటున్నా. అయినా అతడు కోచ్‌ పదవి చేపట్టడం ఆశ్చర్యం కలిగించింది. తమకు సరైన వ్యక్తి దొరికాడని కొందరు చెప్పడాన్ని బట్టి.. పదవి చేపట్టేలా వారు ద్రవిడ్‌ను ఒప్పించివుండొచ్చు’’ అని రికీ తెలిపాడు. టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌గా ఉండాలని తనను సంప్రదించారని కానీ తాను అంగీకరించలేదని పాంటింగ్‌ తెలిపాడు. ‘‘టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ ప్రతిపాదనతో నా వద్దకు కొందరు వచ్చారు. ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నించారు. అంత సమయం కేటాయించలేనని వారితో చెప్పాను’’ అని పాంటింగ్‌ అన్నాడు. దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు రికీ ప్రధాన కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు