Updated : 21/11/2021 07:28 IST

Peng Shuai Missing: ఆన్‌లైన్‌లో పెంగ్‌ ఫొటోలు ప్రత్యక్షం

ఆమె ఆచూకీపై మరింత పెరిగిన ఆందోళన

బీజింగ్‌: మాజీ డబుల్స్‌ నంబర్‌వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి ఫొటోలు తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. దీంతో ఆమె ఆచూకీపై ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. చైనా మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి జాంగ్‌ తనపై లైంగిక హింసకు పాల్పడ్డాడని ఆరోపించినప్పటి నుంచి ఆ దేశానికే చెందిన పెంగ్‌ కనిపించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్‌ వర్గాల నుంచి, ఇతరుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడి సీజీటీఎన్‌ ఛానెల్‌ ఉద్యోగి షెన్‌ షీవీ.. పెంగ్‌ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. వీచాట్‌ అనే సామాజిక మాధ్యమంలో పెంగ్‌ స్వయంగా ఈ ఫొటోలు పోస్టు చేసిందని షెన్‌ ట్వీట్‌లో తెలిపాడు. అక్కడి అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రచురించే ఆంగ్ల పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌ హూ జిజిన్‌.. ‘‘అనధికార సమాచారం ప్రకారం ఈ ఫొటోలు పెంగ్‌ ప్రస్తుత స్థితిని తెలుపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆమె తన సొంత ఇంట్లోనే స్వేచ్ఛగా ఉంది. తనకెలాంటి ఆటంకం కలగకూడదని అనుకుంటోంది. త్వరలోనే ఆమె బయటకు వచ్చి కార్యకలాపాలు సాగిస్తుంది’’ అని ట్వీట్‌ చేశాడు. ఆరోపణలు చేసినప్పటి నుంచి కనిపించని ఆమె.. ఇంతలా ఉద్యమం జరుగుతుంటే సొంతంగా బయటకు రావొచ్చు కదా.. కానీ ఇలా అధికార పార్టీకి చెందిన మీడియాలో ఆమె గురించి ఎందుకు వస్తుందనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. కాగా పెంగ్‌ ఆచూకీ చెప్పాలంటూ అంతర్జాతీయ స్థాయిలో చైనాపై ఒత్తిడి పెరుగుతోంది. పెంగ్‌ క్షేమ సమాచారంపై సాక్ష్యాలు చూపించాలని యుఎస్‌ ప్రభుత్వం కోరుకుంటోందని వైట్‌ హౌస్‌ మీడియా కార్యదర్శి జెన్‌ సాకి పేర్కొన్నారు. పెంగ్‌ చేసిన ఆరోపణలపై పారదర్శక విచారణ జరగాలని ఐక్యరాజ్య సమితి డిమాండ్‌ చేసింది. మరోవైపు ఆమె సురక్షితంగానే ఉందని తెలియకపోతే చైనాతో ఒప్పందం రద్దు చేసుకుంటామని, అక్కడ టోర్నీలు నిర్వహించబోమని డబ్ల్యూటీఏ ఛైర్మన్‌ సిమన్స్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరో రెండున్నర నెలల్లో శీతాకాల ఒలింపిక్స్‌కు చైనా ఆతిథ్యమివ్వాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పెంగ్‌ ఆచూకీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని