
IND vs NZ: సాహా.. వాహ్వా.. నొప్పిని భరిస్తూనే..!
తొలి ప్రాధామ్య వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్ ఇప్పటికే జట్టులో స్థిరపడిపోయాడు. ఇప్పుడు రెండో వికెట్‌కీపర్ స్థానం కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. శ్రీకర్ భరత్ గట్టిగా పోటీపడుతున్నాడు. భవిష్యత్తు చుట్టూ అనిశ్చితి! ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు 37 ఏళ్ల వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా. అది కూడా మెడ నొప్పిని భరిస్తూ. మెడ పట్టేయడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేయలేకపోయిన అతడు.. జట్టు అవసరంలో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అసలు బ్యాటింగ్‌కు వస్తాడా లేదా అన్న సందేహాల మధ్య.. భారత్ 103/6తో ఉండగా బ్యాటింగ్‌కు దిగిన సాహా గొప్ప పోరాటపటిమను ప్రదర్శించాడు. నొప్పి కారణంగా స్టాన్స్‌ను మార్చుకున్న అతడు క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు. లయ అందుకున్నాక చక్కగా బ్యాటింగ్ చేశాడు. విలువైన భాగస్వామ్యాలతో జట్టు మెరుగైన స్థితిలో నిలవడానికి కారణమయ్యాడు. శ్రేయస్ అయ్యర్‌తో ఏడో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సాహా.. అక్షర్ పటేల్‌తో అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. 2017 ఆగస్టు తర్వాత సాహా సాధించిన తొలి అర్ధశతకమిది. దీని కన్నా ముందు ఈ నాలుగేళ్లలో అతడి అత్యధిక స్కోరు 29 పరుగులే కావడం గమనార్హం. ఒకరకంగా ఈ ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలపడమే కాకుండా.. తన పని ఇంకా అయిపోలేదని చాటుకున్నాడని కూడా అనుకోవచ్చు. ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేసిన సాహాపై అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపించారు.
Advertisement