‘మహారాజా’ సారథి సెహ్వాగ్‌

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ) టీ20 టోర్నీలో పాల్గొనే ఇండియన్‌ మహారాజా జట్టుకు మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు మహమ్మద్‌

Published : 19 Jan 2022 04:29 IST

మస్కట్‌: లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ) టీ20 టోర్నీలో పాల్గొనే ఇండియన్‌ మహారాజా జట్టుకు మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు మహమ్మద్‌ కైఫ్‌ చూసుకోనున్నాడు. కోచ్‌గా జాన్‌ బుచానన్‌ (ఆస్ట్రేలియా) ఎంపికయ్యాడు. రిటైర్మెంట్‌ ప్రకటించిన అంతర్జాతీయ ఆటగాళ్ల కోసం నిర్వహిస్తున్న ఈ లీగ్‌ తొలి సీజన్‌ గురువారం ఆరంభమవుతుంది. పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ మాజీ ఆటగాళ్లతో కూడిన ఆసియా లయన్స్‌ జట్టుకు పాక్‌ మాజీ బ్యాటర్‌ మిస్బావుల్‌ హక్‌ కెప్టెన్‌గా, లంక మాజీ ఓపెనర్‌ దిల్షాన్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉంటారు. ఆ జట్టుకు అర్జున రణతుంగ కోచ్‌గా పని చేయనున్నాడు. అఫ్రిది, అక్తర్‌, హఫీజ్‌, ఉమర్‌ గుల్‌, జయసూర్య, చమిందా వాస్‌ లాంటి మాజీ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. వెటోరి, బ్రెట్‌ లీ, కెవిన్‌ పీటర్సన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ వంటి ఆటగాళ్లున్న వరల్డ్‌ జెయింట్స్‌ జట్టుకు విండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి నాయకత్వం వహిస్తాడు. ఇండియన్‌ మహారాజా జట్టులో సెహ్వాగ్‌, కైఫ్‌తో పాటు యువరాజ్‌, హర్భజన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితర మాజీ ఆటగాళ్లున్నారు.

‘‘ఎల్‌ఎల్‌సీ టీ20 టోర్నీ కోసం పని చేసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. సూపర్‌ స్టార్‌ ఆటగాళ్లందరూ ఒక్క దగ్గరికి చేరి ఆరంభ సీజన్‌ ట్రోఫీ కోసం పోటీపడబోతుంటే చూడడాన్ని ఇష్టపడతా. వాళ్లు ఆట నుంచి రిటైరవొచ్చు కానీ వాళ్లలో ఇంకా క్రికెట్‌ పట్ల అంకితభావం అలాగే ఉంది’’ అని ఎల్‌ఎల్‌సీ టీ20 టోర్నీ కమిషనర్‌ రవిశాస్త్రి తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని