Mohammed Siraj: ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్
భారత మాజీ కెప్టెన్ కోహ్లీని సూపర్ హీరోగా అభివర్ణించిన పేసర్ మహమ్మద్ సిరాజ్.. అతనే ఎప్పటికీ తన కెప్టెన్ అని పేర్కొన్నాడు. ‘‘నా సూపర్ హీరో (కోహ్లి).. నీ నుంచి పొందిన మద్దతు,
పార్ల్: భారత మాజీ కెప్టెన్ కోహ్లీని సూపర్ హీరోగా అభివర్ణించిన పేసర్ మహమ్మద్ సిరాజ్.. అతనే ఎప్పటికీ తన కెప్టెన్ అని పేర్కొన్నాడు. ‘‘నా సూపర్ హీరో (కోహ్లి).. నీ నుంచి పొందిన మద్దతు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు చెప్పడం ఏ మాత్రం సరిపోదు. నువ్వెప్పుడూ నా గొప్ప సోదరుడివి. ఇన్నేళ్లుగా నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. నా పేలవ ప్రదర్శనలోనూ ఉత్తమ ఆటతీరు చూశావు. ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్’’ అని సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. కోహ్లి సారథ్యంలోనే సిరాజ్ టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునా వీళ్లిద్దరు కలిసే ఆడుతున్నారు. విరాట్ కెప్టెన్సీలో ఈ హైదరాబాదీ పేసర్ 8 టెస్టుల్లో 27.04 సగటుతో 23 వికెట్లు తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా