12 మంది భారత క్రీడాకారిణులకు పాజిటివ్‌

భారత్‌, చైనీస్‌ తైపీ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఏఎఫ్‌సీ మహిళల ఆసియా కప్‌ గ్రూపు-ఎ మ్యాచ్‌ చివరి నిమిషంలో రద్దయింది. భారత జట్టులో ఏకంగా 12 మంది క్రీడాకారిణులు పాజిటివ్‌గా తేలవడం..

Published : 24 Jan 2022 04:27 IST

భారత్‌, చైనీస్‌ తైపీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ రద్దు

ముంబయి: భారత్‌, చైనీస్‌ తైపీ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఏఎఫ్‌సీ మహిళల ఆసియా కప్‌ గ్రూపు-ఎ మ్యాచ్‌ చివరి నిమిషంలో రద్దయింది. భారత జట్టులో ఏకంగా 12 మంది క్రీడాకారిణులు పాజిటివ్‌గా తేలవడం.. మరో ఇద్దరు గాయాలతో జట్టుకు దూరమవడమే ఇందుకు కారణం. ‘‘పాజిటివ్‌ కేసులు నమోదవడంతో చైనీస్‌ తైపీతో మ్యాచ్‌కు అవసరమైన 13 మందిని బరిలో దించడంలో భారత్‌ విఫలమైంది’’ అని ఏఎఫ్‌సీ పేర్కొంది. ఈ మ్యాచ్‌ రద్దవడంతో భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని