Rahul Dravid: మేనేజర్‌లా ద్రవిడ్‌ పాత్ర: షేన్‌ వార్న్‌

కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ టీమ్‌ఇండియా జట్టులో మరింత దృఢత్వం తీసుకొస్తాడని  ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డాడు. అయితే ద్రవిడ్‌ పాత్ర సంప్రదాయ కోచ్‌ మాదిరి కాకుండా మేనేజర్‌లా ఉంటుందని తెలిపాడు. ‘‘రాహుల్‌ ద్రవిడ్‌ జట్టులో ఎంతో మార్పు తీసుకురాగలడు.

Published : 27 Jan 2022 07:02 IST

దిల్లీ: కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ టీమ్‌ఇండియా జట్టులో మరింత దృఢత్వం తీసుకొస్తాడని  ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ అభిప్రాయపడ్డాడు. అయితే ద్రవిడ్‌ పాత్ర సంప్రదాయ కోచ్‌ మాదిరి కాకుండా మేనేజర్‌లా ఉంటుందని తెలిపాడు. ‘‘రాహుల్‌ ద్రవిడ్‌ జట్టులో ఎంతో మార్పు తీసుకురాగలడు. అద్భుతమైన    క్రికెటర్‌. గొప్ప వ్యక్తి అతను. జట్టులో మరింత దృఢత్వం.. ఆత్మవిశ్వాసాన్ని తెస్తాడు. మంచి వ్యూహాత్మక అంశాలను జోడిస్తాడు. అది జట్టుకు మంచిది కూడా. భారత క్రికెట్లో ద్రవిడ్‌ ఒక అద్భుతం. అంతర్జాతీయ క్రికెట్లో కోచ్‌ అన్న పదం నాకు నచ్చదు. దేశవాళీ క్రికెట్లో కోచ్‌ల అవసరం చాలా ఉంటుంది. కాని అంతర్జాతీయ క్రికెట్లో కోచ్‌ బదులు మేనేజర్‌ అని పిలవాలి. ముందుకు రావాలి.. మోచేతిని పైకి లేపాలి అంటూ పిల్లలకు నేర్పే శిక్షణ అంతర్జాతీయ క్రికెట్లో పనికిరాదు. వయో పరిమితి.. ఫస్ట్‌క్లాస్‌ స్థాయిలో ఆట ఎలా ఆడాలో నేర్పించాలి. అంతర్జాతీయ క్రికెట్‌కు వెళ్లేసరికి ఎలా ఆడాలో తెలిసిపోతుంది. కాని అత్యున్నత స్థాయిలో మానసిక, వ్యూహాత్మక అంశాలే కీలకమవుతాయి’’ అని వార్న్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని