Dhoni: ధోనీలాంటోళ్లు కావాలి: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ ఛాపెల్‌

ప్రతి జట్టులోనూ మహేంద్రసింగ్‌ ధోని లాంటి సహజ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ అన్నాడు. సహజ వాతావరణంలో ఆట నేర్చుకునేవాళ్లే ఎక్కువ కాలం   నిలబడతారని..

Updated : 27 Jan 2022 11:28 IST

దిల్లీ: ప్రతి జట్టులోనూ మహేంద్రసింగ్‌ ధోని లాంటి సహజ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ అన్నాడు. సహజ వాతావరణంలో ఆట నేర్చుకునేవాళ్లే ఎక్కువ కాలం   నిలబడతారని.. ధోని అలాంటి ఆటగాడే అని.. అలాంటి ఆటగాళ్లు తగ్గిపోతుండటం వల్లే వివిధ జట్లు ఇబ్బంది పడుతున్నాయని చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘అభివృద్ధి చెందిన క్రికెట్‌ దేశాలు క్రమంగా సహజ వాతావరణాన్ని కోల్పోతున్నాయి. యువ క్రికెటర్లు ప్రధానంగా ఎదిగేది  ఆ వాతావరణం నుంచే. బాగా ఆడే ఆటగాళ్లను చూస్తూ.. కుటుంబ సభ్యులు, క్రికెటర్లతో    సరదాగా గడుపతూ ఆట నేర్చుకుంటారు. భారత ఉపఖండంలో ఇంకా అలాంటి వాతావరణం ఉంది. చిన్న పట్టణాల్లో శిక్షణ సౌకర్యాలు తక్కువ. అక్కడ వీధుల్లో, ఖాళీగా ఉండే పొలాల్లో ఎక్కువగా క్రికెట్‌ ఆడుతుంటారు. సంప్రదాయ కోచింగ్‌ పద్ధతుల్ని వారు పాటించరు. ప్రస్తుత స్టార్లు చాలామంది అలా ఆట నేర్చుకున్న వాళ్లే. ధోని ఇందుకు సరైన ఉదాహరణ. తన ప్రతిభ, శైలి తనకు తాను తెచ్చుకున్నవే. భారత జట్టులోకి వచ్చాక సీనియర్ల నుంచి, అలాగే పరిస్థితుల నుంచి నేర్చుకుని  తన నైపుణ్యాలను పెంచుకున్నాడు. నాకు తెలిసిన అత్యంత చురుకైన క్రికెట్‌ బుర్రల్లో అతడిది ఒకటి’’ అని చాపెల్‌ పేర్కొన్నాడు. ఇటీవల యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ చిత్తుగా ఓడిపోవడానికి కూడా.. సహజ వాతావరణం క్రికెట్‌   నేర్చుకున్న ఆటగాళ్లు జట్టులో లేకపోవడమే  కారణమని గ్రెగ్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని