అతడికి క్రికెట్‌ ఉంటే చాలు

దీపక్‌ హుడాకు క్రికెట్‌ ఉంటే చాలని.. డబ్బులు కూడా కోరుకోడని బరోడా జట్టు మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టుకు హుడా ఎంపికైన నేపథ్యంలో ఇర్ఫాన్‌ ఇలా వ్యాఖ్యానించాడు.

Published : 28 Jan 2022 02:54 IST

దిల్లీ: దీపక్‌ హుడాకు క్రికెట్‌ ఉంటే చాలని.. డబ్బులు కూడా కోరుకోడని బరోడా జట్టు మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టుకు హుడా ఎంపికైన నేపథ్యంలో ఇర్ఫాన్‌ ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘చాక్లెట్ల మాదిరే క్రికెట్‌ రుచికి హుడా అలవాటుపడిపోయాడు. అతడికి మైదానంలో దిగితే చాలు. ప్రస్తుతం భారత జట్టుకు ఇలాంటి బ్యాటింగ్‌ ఆల్‌రౌండరే కావాలి. దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి టీమ్‌ఇండియాకు ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంది’’ అని ఇర్ఫాన్‌ అన్నాడు. చిన్న జట్లలో చేరిన పెద్ద జట్టు ఆటగాళ్లు సాధారణంగా ఎక్కువ మ్యాచ్‌ ఫీజులు తీసుకుంటారని కానీ రాజస్థాన్‌ అధికారులతో హుడా ఆ విషయం గురించి మాట్లాడనే లేదని ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. ‘‘హుడాను తమ జట్టులో చేర్చుకోవాలని చాలా జట్లు అనుకున్నాయి. కానీ డబ్బులు గురించి అతడెప్పుడూ ఆలోచించడు. మైదానంలోకి వెళ్లడం.. ఆడడమే అతడికి తెలిసింది. బరోడా నుంచి రాజస్థాన్‌ జట్టుకు వచ్చినప్పుడు డబ్బుల గురించి అధికారులతో అతడు మాట్లాడక పోవడమే ఇందుకు నిదర్శనం’’ అని పఠాన్‌ అన్నాడు.  2017లో టీ20 జట్టుకు ఎంపికైనా.. హుడాకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. గత సీజన్లో బరోడా కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యతో హోటల్‌ గదిలో గొడవపడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న 26 ఏళ్ల దీపక్‌.. ఆ తర్వాత జట్టును వీడి రాజస్థాన్‌ జట్టులో చేరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని