క్వార్టర్స్‌లో సింధు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ క్రీడాకారిణి పి.వి.సింధు ఒంటరి పోరాటం చేస్తుంది. ఈ టోర్నీలో భారత క్రీడాకారులంతా ఇంటిముఖం పట్టగా.. మహిళల సింగిల్స్‌లో సింధు క్వార్టర్‌ఫైనల్‌ చేరుకుంది.

Published : 20 May 2022 02:14 IST

వైదొలిగిన శ్రీకాంత్‌

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ క్రీడాకారిణి పి.వి.సింధు ఒంటరి పోరాటం చేస్తుంది. ఈ టోర్నీలో భారత క్రీడాకారులంతా ఇంటిముఖం పట్టగా.. మహిళల సింగిల్స్‌లో సింధు క్వార్టర్‌ఫైనల్‌ చేరుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సింధు 21-16, 21-13తో సిమ్‌ యు జిన్‌ (కొరియా)పై విజయం సాధించింది. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు అన్ని రంగాల్లోనూ ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ అకానె యమగూచి (జపాన్‌)తో సింధు తలపడుతుంది. మరో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో మాళవిక బాన్సోద్‌ 21-16, 14-21, 14-21తో లైన్‌ క్రిస్టోఫెర్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పోరాడి ఓడింది. స్టార్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ ప్రత్యర్థి నుయెన్‌ (ఐర్లాండ్‌)కు వాకోవర్‌ లభించింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని భట్‌- శిఖ గౌతమ్‌ జోడీ 19-21, 6-21తో మత్సుమొటో- నగహర (జపాన్‌) జంట చేతిలో ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఇషాన్‌ భట్నాగర్‌- తనిషా క్రాస్టో జోడీ 19-21, 20-22తో సూన్‌ హువాత్‌- షెవాన్‌ జెమీ (మలేసియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని