‘90’పై నాకు ఆందోళన లేదు

నీరజ్‌ చోప్రా ప్రత్యర్థులు కొందరు ఇటీవల 90మీ పై త్రోలు చేశారు. అయితే వాళ్ల ప్రదర్శన చూసి తానేమీ ఆందోళన చెందట్లేదని అంటున్నాడు. ఈ భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌.

Published : 22 May 2022 04:03 IST

దిల్లీ: నీరజ్‌ చోప్రా ప్రత్యర్థులు కొందరు ఇటీవల 90మీ పై త్రోలు చేశారు. అయితే వాళ్ల ప్రదర్శన చూసి తానేమీ ఆందోళన చెందట్లేదని అంటున్నాడు. ఈ భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌. తాను కూడా వాళ్ల సరసన చేరాలనుకుంటున్నానని చెప్పాడు.  మే 13న దోహా డైమండ్‌ లీగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) జావెలిన్‌ను 93.07 మీటర్ల దూరం విసిరితే.. టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత జాకుబ్‌ వద్లేచ్‌ (చెక్‌) 90.88 మీటర్లు విసిరాడు. ‘‘దూరం గురించి నేను ఒత్తిడికి లోను కాను. పీటర్స్, వద్లేచ్‌ బాగా కష్టపడుతూ ఉండొచ్చు. అందుకే మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. 90 మీటర్లు దాటాలన్నది నా కల కూడా. ఈ ఏడాదే దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తా. సాధారణంగా నేను ఎవరి ప్రదర్శననో, రికార్డునో దాటడం గురించి ఆలోచించను. నా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తానంతే’’ అని నీరజ్‌ అన్నాడు. 24 ఏళ్ల నీరజ్‌ ప్రస్తుతం టర్కీలో శిక్షణ తీసుకుంటున్నాడు. అతడి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 88.07 మీటర్లు. టోక్యో ఒలింపిక్స్‌ 87.58 మీటర్లతో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్నాడు. నీరజ్‌ జూన్‌ 14న ఫిన్లాండ్‌లో పావో నుర్మి గేమ్స్‌లో పోటీపడనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని