కార్ల్‌సన్‌పై మళ్లీ..
భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద .. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)పై మరోసారి విజయం సాధించాడు. చెసబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అయిదో రౌండ్లో కార్ల్‌సన్‌ను అతడు ఓడించాడు.
దిల్లీ: భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద .. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)పై మరోసారి విజయం సాధించాడు. చెసబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అయిదో రౌండ్లో కార్ల్‌సన్‌ను అతడు ఓడించాడు. గేమ్ డ్రా దిశగా సాగుతుండగా 40వ ఎత్తులో కార్ల్సన్ పెద్ద తప్పు చేశాడు. ఆరో రౌండ్లో హరికృష్ణను నిలువరించిన ప్రజ్ఞానంద.. ఆ తర్వాతి గేమ్‌లో గవిన్ జోన్స్‌ను ఓడించాడు. ఎనిమిదో రౌండ్లో గ్విజారో చేతిలో ఓడిపోయాడు. టోర్నీలో ప్రస్తుతం అతడు 12 పాయింట్లతో అయిదో స్థానంలో ఉన్నాడు. 16 ఏళ్ల ప్రజ్ఞానంద మూడు నెలల కింద కూడా ఆన్లైన్ ర్యాపిడ్ గేమ్‌లో కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!