అలా అయితే ద్వైపాక్షిక సిరీస్‌లకు దెబ్బే: బార్క్‌లె

భారత క్రికెట్‌ లీగ్‌ లాంటి టీ20 టోర్నీల్లో మ్యాచ్‌ల సంఖ్యను పెంచుకుంటూ పోతే అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌లు కుచించుకుపోతాయని ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లె అన్నాడు.

Updated : 28 May 2022 03:45 IST

ముంబయి: భారత క్రికెట్‌ లీగ్‌ లాంటి టీ20 టోర్నీల్లో మ్యాచ్‌ల సంఖ్యను పెంచుకుంటూ పోతే అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌లు కుచించుకుపోతాయని ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లె అన్నాడు. ఈ సీజన్‌లో 10 జట్లు ఆడుతుండడంతో మ్యాచ్‌లు 60 నుంచి 74కు పెరిగిన నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘ భారత టీ20 లీగ్‌ మ్యాచ్‌ల సంఖ్య పెరగడం వల్ల అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ కుచించుకుపోతుంది. ఐసీసీ టోర్నీలు ప్రతి ఏడాది ఉండవు కాబట్టి ఫర్వాలేదు. కానీ నష్టపోయేది ద్వైపాక్షిక సిరీస్‌లే. కానీ వ్యక్తిగతం నేను ఈ మెగా టోర్నీ ఇష్టపడతాను’’ అని బార్క్‌లె చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని