పంత్‌ 100 టెస్టులు ఆడితే..

రికార్డు పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే రిషబ్‌ పంత్‌ టెస్టుల్లో 100 మ్యాచ్‌ల మైలురాయి అందుకోవాలని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ‘‘పంత్‌ 100 అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడితే అతడి పేరు రికార్డు పుస్తకాల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది.

Published : 28 May 2022 03:06 IST

ముంబయి: రికార్డు పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే రిషబ్‌ పంత్‌ టెస్టుల్లో 100 మ్యాచ్‌ల మైలురాయి అందుకోవాలని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ‘‘పంత్‌ 100 అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడితే అతడి పేరు రికార్డు పుస్తకాల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎందుకంటే 12 మంది భారత ఆటగాళ్లు మాత్రమే ఇప్పటిదాకా వంద అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడారు. ఆ పన్నెండు మంది ఎవరో అందరికి తెలుసు. టీ20, వన్డేల్లో జట్టును గెలిపించడం బాగానే ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా చూస్తే ఆటగాడు టెస్టుల్లో ఏం సాధించాడనేదే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే కోహ్లి లాంటి ఆటగాడు టెస్టుల విలువ గురించి పదే పదే చెబుతుంటాడు. 150 లేదా 200 టెస్టులు ఆడితే రికార్డు పుస్తకాల్లో చిరస్థాయిగా ఉంటానని అతడికి తెలుసు’’ అని వీరూ చెప్పాడు. ఇప్పటిదాకా 30 టెస్టులు ఆడి 40.85 సగటుతో 1920 పరుగులు చేసిన పంత్‌.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాల్లో సెంచరీలు బాదిన తొలి భారత వికెట్‌కీపర్‌గా ఘనత సాధించాడు. సచిన్‌ (200), ద్రవిడ్‌ (163), లక్ష్మణ్‌ (134), కుంబ్లే (132), కపిల్‌దేవ్‌ (131), గావస్కర్‌ (125), వెంగ్‌సర్కార్‌ (116), గంగూలీ (113), ఇషాంత్‌ (105), హర్భజన్‌ (103), సెహ్వాగ్‌ (103), కోహ్లి (101) మాత్రమే వంద టెస్టులు ఆడిన భారత క్రికెటర్ల జాబితాలో ఉన్నారు. వీరిలో సచిన్‌ ఒక్కడే ప్రపంచ రికార్డు సృష్టిస్తూ 200 టెస్టులు ఆడిన ఘనత సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని