IND vs NZ: అతడో ఛాంపియన్‌ క్రికెటర్‌ : దానిశ్‌ కనేరియా

టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇటీవల ముగిసిన తొలి టెస్టులో మెరుగ్గా రాణించిన సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై.. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ దానిశ్‌ కనేరియా ప్రశంసలు కురిపించాడు.

Published : 01 Dec 2021 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇటీవల ముగిసిన తొలి టెస్టులో మెరుగ్గా రాణించిన సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై.. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ దానిశ్‌ కనేరియా ప్రశంసలు కురిపించాడు. జట్టు కష్టసమయాల్లో ఉన్నప్పుడు వికెట్లు తీయడంతో పాటు.. ఆఖర్లో బ్యాటింగ్‌ వచ్చి విలువైన పరుగులు చేయగలడని పేర్కొన్నాడు. ‘న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా బౌలర్లు గొప్పగా రాణించారు. అక్షర్‌ పటేల్, రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఇద్దరూ ఆరేసి వికెట్లు తీశారు. అయితే, అశ్విన్‌ కీలక సమయంలో వికెట్లు తీయడంతో పాటు, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు కూడా చేశాడు. అందుకే, అతడో ఛాంపియన్‌ క్రికెటర్’ అని దానిశ్ కనేరియా అన్నాడు. 

ఆఖరి రోజు లంచ్‌ బ్రేక్‌ తర్వాత మ్యాచ్ అనూహ్య మలుపులు తిరిగిందని దానిశ్ కనేరియా అభిప్రాయపడ్డాడు. తొలి సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన భారత బౌలర్లు.. లంచ్‌ బ్రేక్ తర్వాత గొప్పగా పుంజుకున్నారని పేర్కొన్నాడు. చివరి రెండు సెషన్లలోనే భారత బౌలర్లు ఎనిమిది వికెట్లు పడగొట్టి సత్తా చాటరని అన్నాడు. కాన్పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబరు 3 నుంచి ముంబయి వేదికగా రెండో టెస్టు జరుగనుంది.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని