100 ఏళ్ల ఒలింపిక్‌ ఛాంపియన్‌ 

ప్రస్తుతం జీవించి ఉన్న ఒలింపిక్‌ ఛాంపియన్లలో అత్యధిక వయసు కలిగిన అథ్లెట్‌గా కొనసాగుతున్న ఆగ్నెస్‌ కెలెటీ జీవితంలో మరో మైలురాయిని చేరుకుంది...

Published : 10 Jan 2021 22:51 IST

బుడాపెస్ట్‌: ప్రస్తుతం జీవించి ఉన్న ఒలింపిక్‌ ఛాంపియన్లలో అత్యధిక వయసు కలిగిన అథ్లెట్‌గా కొనసాగుతున్న ఆగ్నెస్‌ కెలెటీ జీవితంలో మరో మైలురాయిని చేరుకుంది. హంగేరీకి చెందిన ఈ మాజీ జిమ్నాస్ట్‌ శనివారం వందో పుట్టినరోజు వేడుకలు చేసుకుంది. తన కెరీర్‌లో అయిదు స్వర్ణాలతో సహా మొత్తం పది ఒలింపిక్స్‌ పతకాలు సాధించిన ఆమె.. తన జీవితంలోని సంతోషాలు, బాధలు, ఘనతలను ఈ సందర్భంగా గుర్తుకుతెచ్చుకుంది. ‘‘ఈ వందేళ్లు నాకు 60 సంవత్సరాల్లాగే అనిపిస్తోంది’’ అని చెప్పిన ఆమె.. తన జీవితం గురించి వచ్చిన కొత్త పుస్తకం ‘‘ది క్వీన్‌ ఆఫ్‌ జిమ్నాస్టిక్స్‌: 100 ఇయర్స్‌ ఆఫ్‌ ఆగ్నెస్‌ కెలెటీ’’ పై మాట్లాడింది. ‘‘జిమ్నాస్టిక్స్‌ రాణిగా తనను పేర్కొనడం అతిశయోక్తి మాత్రమే. నేను జీవితాన్ని ప్రేమిస్తా. ఆరోగ్యం చాలా ముఖ్యం. అది లేకుంటే ఏమీ లేనట్టే. ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కింది కాబట్టి జిమ్నాస్టిక్స్‌ను ఇష్టపడేదాన్ని. ఇప్పటికీ నేను మంచి ఆరోగ్యంతోనే ఉండడం గొప్పగా ఉంది’’ అని ఆమె పేర్కొంది. 1921లో జన్మించిన ఆమె.. చిన్నతనం నుంచే జిమ్మాస్టిక్స్‌పై ఆసక్తి పెంచుకుంది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1944 ఒలింపిక్స్‌ వాయిదా పడడంతో ఆమె కెరీర్‌కు అంతరాయం ఏర్పడింది. 31 ఏళ్ల వయసులో 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో పాల్గొని ఓ స్వర్ణం, రజతంతో పాటు రెండు కాంస్యాలు గెలిచింది. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలతో చరిత్ర సృష్టించింది. 

ఇవీ చదవండి..

ఇంతకన్నా బాగా ఆడలేను: పుజారా

నయావాల్‌.. డీకోడెడ్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని