Chris Gayle: నేను వదిలి వెళ్లడం లేదు.. : క్రిస్ గేల్
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్‌గేల్ తన రిటైర్మెంట్ సంబంధించి తాజాగా ఓ కీలక ప్రకటన చేశాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా అడుగుపెట్టిన వెస్టిండీస్ పేలవమైన ఆటతీరుతో సెమీస్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్‌గేల్ తన రిటైర్మెంట్ సంబంధించి తాజాగా ఓ కీలక ప్రకటన చేశాడు. గురువారం రాత్రి ట్విటర్లో అందుకు సంబంధించిన ఆసక్తికర పోస్టు పెట్టాడు. ‘నేను వదిలి వెళ్లడం లేదు’ అని ట్వీట్ చేశాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చిన గేల్‌ను సహచరులు చప్పట్లతో అభినందించారు. అతడు ఔటయ్యాక మైదానానికి సెల్యూట్ చేస్తూ ప్రేక్షకుల వైపు గ్లోవ్స్ విసిరాడు. అనంతరం ఐసీసీ ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. “నేను మరో ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నా. కానీ అనుమతిస్తారని నేను అనుకోను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఇప్పటికి నేను ఎలాంటి రిటైర్మెంట్ ప్రకటించలేదు. నిజానికి జమైకాలో ఒక గేమ్ ఆడాలనుకుంటున్నా. సొంత ప్రేక్షకుల మధ్య చివరి మ్యాచ్ ఆడి రిటైరవ్వాలనుకుంటున్నా’’ అని గేల్ చెప్పుకొచ్చాడు.
* మొత్తం79 టీ20లు, 103 టెస్టులు, 301 వన్డేలు ఆడిన గేల్ అంతర్జాతీయ క్రికెట్లో 22 ఏళ్లుగా కొనసాగుతున్నాడు. అయితే ఇంతకుముందే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
* 2012, 2016 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!