Team India: టీమ్‌ఇండియా ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు జట్టు: షేన్‌ వార్న్‌

ఓవల్‌ వేదికగా  జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై  157 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా ఘన  విజయం సాధించింది. దీంతో భారత జట్టుపై భారత మాజీ ఆటగాళ్లతోపాటు ఇతర దేశాల ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం

Updated : 07 Sep 2021 16:54 IST

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఓవల్‌ వేదికగా  జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై  157 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా ఘన  విజయం సాధించింది. దీంతో భారత జట్టుపై భారత మాజీ ఆటగాళ్లతోపాటు ఇతర దేశాల ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్ కూడా టీమ్‌ఇండియాను ట్విటర్ వేదికగా ప్రశంసించాడు. ‘మరో అద్భుతమైన విజయం సాధించిన భారత జట్టుకు  అభినందనలు. గత 12 నెలలుగా మీరందరూ సాధించినది కచ్చితంగా అద్భుతమైనది. నిజంగా.. ప్రపంచంలో టీమ్‌ఇండియా అత్యుత్తమ టెస్టు జట్టు’ అని షేన్‌ వార్న్‌ ట్వీట్‌ చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైన టీమ్‌ఇండియా.. అనుహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుని 466 పరుగులు చేసి మంచి అధిక్యం సంపాదించింది. రోహిత్ శర్మ(127) శతకంతో అదరగొట్టగా..శార్దూల్ ఠాకూర్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. మిగతా బౌలర్లు కూడా రెండో ఇన్నింగ్స్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ఇంగ్లాండ్‌ని 210 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమ్‌ఇండియా 157 పరుగులతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 అధిక్యంలో నిలిచింది. చివరి టెస్టు సెప్టెంబరు 10న మాంచెస్టర్‌ వేదికగా ప్రారంభంకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని