IND vs NZ: రెండో సెషన్‌ పూర్తి.. న్యూజిలాండ్‌ ఓపెనర్ల శుభారంభం

రెండో రోజు రెండో సెషన్‌ పూర్తయింది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఆరంభించింది...

Published : 26 Nov 2021 14:21 IST

(Photo: BLACK CAPS Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండో రోజు రెండో సెషన్‌ పూర్తయింది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఆరంభించింది. ఈ క్రమంలోనే కివీస్‌ ఓపెనర్లు శుభారంభం చేశారు. టామ్‌ లాథమ్‌ (23; 72 బంతుల్లో 2x4), విల్‌ యంగ్‌ (46; 86 బంతుల్లో 7x4) పట్టుదలగా ఆడుతున్నారు. తొలుత ఆచితూచి ఆడిన వీరు తర్వాత కుదురుకున్నాక ధాటిగా ఆడుతున్నారు. దీంతో రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా 72 పరుగులు చేసి శుభారంభం చేశారు. న్యూజిలాండ్‌ ఇంకా 273 పరుగుల వెనుకంజలో నిలిచింది. మరోవైపు భారత బౌలర్లు వికెట్లు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని