WTC Final: పోటీలోకొచ్చిన టీమ్‌ఇండియా 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో వర్షం కారణంగా ఐదోరోజు ఆట గంట ఆలస్యంగా ప్రారంభమైనా టీమ్‌ఇండియా తొలి సెషన్‌లో 3 వికెట్లతో న్యూజిలాండ్‌పై పైచేయి సాధించింది. మరోవైపు ఆ జట్టు 33 పరుగులే సాధించి...

Updated : 22 Jun 2021 18:27 IST

మూడు వికెట్లు పడగొట్టిన షమి, ఇషాంత్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో వర్షం కారణంగా ఐదోరోజు ఆట గంట ఆలస్యంగా ప్రారంభమైనా టీమ్‌ఇండియా తొలి సెషన్‌లో 3 వికెట్లతో న్యూజిలాండ్‌పై పైచేయి సాధించింది. మరోవైపు ఆ జట్టు 33 పరుగులే సాధించి నెమ్మదిగా ఇన్నింగ్స్‌ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి న్యూజిలాండ్‌ స్కోర్‌ 135/5గా నమోదైంది. విలియమ్సన్‌(19), గ్రాండ్‌హోమ్‌(0) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు 101/2 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆట కొనసాగించిన విలియమ్సన్‌, రాస్‌టేలర్‌ చాలాసేపు వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే భారత పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటూ నెమ్మదిగా పరుగులు తీశారు. అయితే, జట్టు స్కోర్‌ 117 పరుగుల వద్ద షమి బౌలింగ్‌లో రాస్‌టేలర్‌(11) శుభ్‌మన్‌ చేతికి చిక్కడంతో కివీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. తర్వాత భోజన విరామానికి ముందు వరుస ఓవర్లలో ఇషాంత్‌..హెన్రీ నికోల్స్‌(7)ను, షమి.. జేబీ వాట్లింగ్‌(1)ను పెవిలియన్‌ పంపారు. దాంతో ఒక్కసారిగా టీమ్‌ఇండియా మళ్లీ పోటీలోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ భారత్‌కన్నా 82 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని