IND vs ENG:ఆ పరుగులు అదృష్టం వల్ల రాలేదు: శార్దూల్ ఠాకూర్‌

ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. నాలుగు టెస్టుల్లో మూడు అర్ధసెంచరీలు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, ఈ మ్యాచ్‌ల్లో తాను చేసిన పరుగులు అదృష్టం వల్ల వచ్చినవి కాదని, ఒక పద్ధతిని

Published : 17 Sep 2021 01:42 IST

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. నాలుగు టెస్టుల్లో మూడు అర్ధసెంచరీలు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, ఈ మ్యాచ్‌ల్లో తాను చేసిన పరుగులు అదృష్టం వల్ల వచ్చినవి కాదని, ఒక పద్ధతిని అనుసరించి ఆడటం వల్ల అది సాధ్యమైందని శార్దూల్ ఠాకూర్ అన్నాడు.

‘నేను ఇప్పటివరకు చేసిన పరుగులు అదృష్టం వల్ల వచ్చాయని ఎవరైనా భావిస్తే.. వారికి శుభాకాంక్షలు!నేను బ్యాటింగ్ చేయగలనని నాకు తెలుసు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.ఇప్పుడు నాపై నాకు మరింత నమ్మకం వచ్చింది. నెట్స్‌లో క్రమం తప్పకుండా బ్యాటింగ్ చేస్తాను. బ్యాటింగ్‌లో జట్టుకు ఉపయోగపడతానని యాజమాన్యానికి నమ్మకం ఉంది. ఏది ఏమైనా నేను ఇప్పటివరకు చేసిన పరుగులు యాదృచ్చికంగానో, అదృష్టంతో వచ్చినవి కావు. ఒక పద్ధతిని అనుసరించడం వల్ల అది సాధ్యమైంది. కొంతమంది మొదట ఎడమ కాలికి ప్యాడ్స్‌ ధరించడం, బస్సులో లేదా డ్రెస్సింగ్‌ రూమ్‌లో నిర్దిష్ట ప్రదేశంలోనే కూర్చోవడం వంటివి పాటిస్తారు. నేను వీటి కంటే ఆటపైనే ఎక్కువ నమ్మకం కలిగివుంటాను’ అని శార్దూల్ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని