Paralympics: దేశాన్ని గర్వపడేలా చేశారు.. మా విమానాల్లో ఉచితంగా ప్రయాణించండి

టోక్యో పారాలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించిన అవని లేఖరా, సుమిత్‌ అంటిల్‌కు ‘ఇండిగోఎయిర్‌లైన్స్‌’ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏడాది పాటు తమ విమానాల్లో ఉచిత ప్రయాణ సేవలు అందించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. 

Published : 31 Aug 2021 23:59 IST

ప్రకటించిన ఇండిగో సంస్థ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో పారాలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించిన అవని లేఖరా, సుమిత్‌ అంటిల్‌కు ‘ఇండిగోఎయిర్‌లైన్స్‌’ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏడాది పాటు తమ విమానాల్లో ఉచిత ప్రయాణ సేవలు అందించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు ఇవి వర్తిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో రొనోజోయ్‌ దత్తా మాట్లాడుతూ.. ‘మీరిద్దరూ అసమాన పట్టుదల, ధైర్యం, తెగువ కనబరిచారు. ఇదంతా సులభమైన విషయం కాదు. మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. మీకు ఉచితంగా ఏడాదిపాటు ఇండిగో విమాన సేవలు అందించాలనుకుంటున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అవని.. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ విభాగంలో, సుమిత్‌ జావెలిన్‌ త్రో ఎఫ్‌-64 విభాగంలో స్వర్ణాలు సాధించిన విషయం తెలిసిందే. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత తొలి మహిళగా అవని రికార్డు సృష్టించగా, పతకాన్ని సాధించే క్రమంలో సుమిత్‌ మూడుసార్లు ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని