IPL 2021:ప్లే ఆఫ్స్‌ గురించి ఆలోచించటం లేదు: రాహుల్‌ తెవాతియా

ఐపీఎల్-14 సీజన్‌లో లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. మంగళవారం ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇరుజట్లకు ఇది చాలా కీలకమైన మ్యాచ్‌. ఇందులో విజయం సాధించిన జట్టుకు ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ఓడిన

Updated : 05 Oct 2021 16:37 IST

(Photo: Rahul Tewatia Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్-14 సీజన్‌లో లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. మంగళవారం ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇరుజట్లకు ఇది చాలా కీలకమైన మ్యాచ్‌. ఇందులో విజయం సాధించిన జట్టు ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ఓడిన జట్టు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే. దీంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశముంది. ప్రస్తుతం ఈ రెండు  జట్లు 10 పాయింట్లతో సమానంగా కొనసాగుతున్నా.. రన్‌రేట్‌ (-0.453) పరంగా వెనుకంజలోనే ఉన్న ముంబయి ఏడో స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా, తమ జట్టు ప్లే ఆఫ్స్‌ గురించి ఆలోచించడం లేదని, ఒక మ్యాచ్‌ని ఒక్కసారి మాత్రమే ఆడతామని రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రాహుల్ తెవాతియా అన్నాడు.

‘మాకు అన్ని మ్యాచ్‌లు చాలా కీలకమైనవి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం గురించి మేం ఆలోచించడం లేదు. ఒక మ్యాచ్‌ని ఒక్కసారి మాత్రమే ఆడతాం. గత మ్యాచ్‌లో ఆడిన విధంగా వంద శాతం మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం. మా టీమ్‌ డైరెక్టర్ కుమార సంగక్కర కూడా ఇదే సూచించారు. అవును, మా మిడిల్‌ ఆర్డర్‌ తడబడుతోంది. నేను బాధ్యత తీసుకుంటా. నేను అంచనాలకు తగ్గట్టు రాణించడం లేదని నాకు తెలుసు. రానున్న మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేయడానికి కృషిచేస్తా’ అని తెవాతియా అన్నాడు. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌ గురించి స్పందిస్తూ..‘ముంబయి మిడిల్‌ ఆర్డర్‌ చాలా బాగుంది. టాప్‌ ఆర్డర్‌ కూడా పటిష్టంగా ఉంది. తెలివిగా ఆడి గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని తెవాతియా ముగించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని