IPL 2021: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ కింగ్స్‌

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) మలి దశలో దుబాయి వేదికగా మూడో మ్యాచ్‌ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్‌..రాజస్థాన్‌ని

Updated : 21 Sep 2021 19:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) మలి దశలో దుబాయి వేదికగా మూడో మ్యాచ్‌ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్‌..రాజస్థాన్‌ని  బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్‌.. ఏడో స్థానంలో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా.. ఇరు జట్లలోని పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే.  రాజస్థాన్‌ తరఫున ఆడుతున్న జోస్ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, ఆండ్రూ టై, జోఫ్రా ఆర్చర్‌ వంటి కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమవడం ఆ జట్టుకు  ప్రతికూలాంశం. అలాగే, పంజాబ్‌ కింగ్స్‌ హిట్టర్‌ డేవిడ్‌ మలన్‌తో పాటు మరికొందరు దూరమయ్యారు. వీరి స్థానాల్లో కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

పంజాబ్‌ కింగ్స్‌ జట్టు..
కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మయాంక్‌ అగర్వాల్‌, ఆడెన్‌ మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, దీపక్‌ హుడా, అదిల్‌ రషీద్‌, అలెన్‌, రవి బిష్ణోయ్‌,  హర్‌ప్రీత్‌బ్రర్‌, అర్ష్‌దీప్‌ సింగ్, ఇషాన్‌ పొరెల్‌‌, మహమ్మద్ షమి

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు..
ఎవిన్‌ లెవిస్‌, యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మహిపాల్‌ లోమ్రోర్‌, రియాన్‌ పరాగ్‌, లివింగ్‌ స్టోన్‌,‌ రాహుల్‌ తెవాటియా, క్రిస్‌ మోరిస్‌, చేతన్‌ సకారియా, కార్తిక్‌ త్యాగి, ముస్తాఫిజుర్ రహ్మన్. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని