Qualifier 1 CSK vs DC: చెన్నై సూపర్‌ కింగ్స్‌ లక్ష్యం 173

ఐపీఎల్‌-14 సీజన్‌ క్వాలిఫయర్‌-1లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా (60; 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రిషభ్‌ పంత్‌ (51; 35 బంతుల్లో

Published : 10 Oct 2021 21:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-14 సీజన్‌ క్వాలిఫయర్‌-1లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా (60; 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రిషభ్‌ పంత్‌ (51; 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మయర్‌ (37; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ధావన్ (7), శ్రేయస్ అయ్యర్‌ (1), అక్షర్‌ పటేల్‌ (10) నిరాశపర్చారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి మంచి ఆరంభం లభించింది. ధావన్ నెమ్మదిగా ఆడినా.. పృథ్వీ షా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. హేజిల్‌వుడ్‌ వేసిన రెండో ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌ బాదిన పృథ్వీ.. దీపక్‌ చాహర్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. హేజిల్‌వుడ్‌ వేసిన నాలుగో ఓవర్లో ధావన్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. శార్దూల్ వేసిన ఐదో ఓవర్లో పృథ్వీ షా రెండు సిక్స్‌లు బాదాడు. ధాటిగా ఆడుతున్న పృథ్వీ షాని 11 ఓవర్‌లో జడేజా పెలివియన్‌కి పంపించాడు. తర్వాత పంత్‌, హెట్‌మయర్‌ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించారు. బ్రావో వేసిన 19 ఓవర్లో హెట్‌మయర్‌ జడేజాకి చిక్కాడు. చెన్నై బౌలర్లలో హేజిల్‌వుడ్‌ రెండు, జడేజా, మొయిన్ అలీ‌,  బ్రావో తలో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని