Updated : 11/10/2021 08:52 IST

IPL 2021: ఉత్కంఠపోరులో చెన్నైదే విజయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్-14 సీజన్‌ తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది. దిల్లీ క్యాపిటల్స్‌పై  నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రుతురాజ్‌ గైక్వాడ్ (70; 50 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), రాబిన్‌ ఊతప్ప (63; 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో దిల్లీకి ఓటమి తప్పలేదు. దిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో ఛేదించింది. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి మొయిన్ అలీ (16) ఔటయ్యాడు. ధోనీ (18; 6 బంతుల్లో 3 ఫోర్లు) వరుసగా మూడు ఫోర్లు కొట్టి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. దిల్లీ బౌలర్లలో టామ్‌కరన్ మూడు, నార్జ్‌, అవేశ్‌ఖాన్‌ తలో వికెట్ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా (60; 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రిషభ్‌ పంత్‌ (51; 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మయర్‌ (37; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ధావన్ (7), శ్రేయస్ అయ్యర్‌ (1), అక్షర్‌ పటేల్‌ (10) నిరాశపర్చారు. ధావన్ నెమ్మదిగా ఆడినా.. పృథ్వీ షా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. హేజిల్‌వుడ్‌ వేసిన రెండో ఓవర్‌లో సిక్స్‌, ఫోర్‌ బాదిన పృథ్వీ.. దీపక్‌ చాహర్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టాడు. హేజిల్‌వుడ్‌ వేసిన నాలుగో ఓవర్లో ధావన్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. శార్దూల్ వేసిన ఐదో ఓవర్లో పృథ్వీ షా రెండు సిక్స్‌లు బాదాడు. ధాటిగా ఆడుతున్న పృథ్వీ షాని 11 ఓవర్‌లో జడేజా పెలివియన్‌కి పంపించాడు. తర్వాత పంత్‌, హెట్‌మయర్‌ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించారు. బ్రావో వేసిన 19 ఓవర్లో హెట్‌మయర్‌ జడేజాకి చిక్కాడు. చెన్నై బౌలర్లలో హేజిల్‌వుడ్‌ రెండు, జడేజా, మొయిన్ అలీ‌,  బ్రావో తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని