Virat:కోహ్లీ అతడి బౌలింగ్‌లో తడబడుతున్నాడు:ఇర్ఫాన్‌ పఠాన్‌ 

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ మిచెల్ జాన్సన్‌ భీకర బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో ఎప్పుడూ కంగారు పడని విరాట్‌ కోహ్లీ.. ఇంగ్లాండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మాత్రం తడబడుతున్నాడని మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌

Published : 11 Jun 2021 00:07 IST

(photo:Virat Kohli Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ మిచెల్ జాన్సన్‌ భీకర బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో ఎప్పుడూ కంగారు పడని విరాట్‌ కోహ్లీ.. ఇంగ్లాండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మాత్రం తడబడుతున్నాడని మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మన్‌ కూడా స్వింగ్‌ బౌలింగ్‌లో సౌకర్యంగా బ్యాటింగ్‌ చేయలేడని, స్వింగ్‌ అవుతున్న బంతిని అంచనా వేయడం కష్టమని అని ఇర్ఫాన్‌ అన్నాడు.

‘పాట్‌ కమిన్స్, జోఫ్రా అర్చర్‌ బౌలింగ్‌లో రిషభ్‌ పంత్‌, జోస్‌ బట్లర్‌ ల్యాప్‌ షాట్‌(వికెట్ల వెనుకకు బాదడం),రివర్స్‌ స్వీప్స్‌ షాట్లు ఆడటం మనం చూశాం. వేగంగా మాత్రమే బౌలింగ్‌ చేసి విజయవంతం కాలేం ఎందుకంటే బ్యాట్స్‌మెన్‌ ఎల్లప్పుడూ పేస్‌కి భయపడరు. మీరు రాణించాలంటే నైపుణ్యం తప్పనిసరి. స్వింగ్‌ అనేది గొప్ప కళ’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.

2014లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో కోహ్లీ అండర్సన్ బౌలింగ్‌లో నాలుగుసార్లు ఔటవ్వడమే కాకుండా 10  ఇన్నింగ్స్‌ల్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. ఆగస్టులో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు ఆడనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇర్ఫాన్ ఈ విధంగా స్పందించాడు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని