Rohit-Rahul: ఓపెనింగ్ వాళ్లిద్దరే చేయాలి : ఆకాశ్‌ చోప్రా

టీమిండియా ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లనే కొనసాగించాలని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. జట్టులోకి ఎక్కువ మంది ఓపెనర్లను తీసుకోవడం వల్ల గందరగోళం ఏర్పడుతుందని

Published : 18 Nov 2021 20:24 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లనే కొనసాగించాలని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. జట్టులోకి ఎక్కువ మంది ఓపెనర్లను తీసుకోవడం వల్ల గందరగోళం ఏర్పడుతుందని అన్నాడు. ‘ప్రస్తుతం భారత క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌లను కొనసాగించాలి. తుదిజట్టులోకి ఐదారు మందిని ఓపెనర్లుగా తీసుకుంటే ఓపెనింగ్‌ చేసే విషయంలో కొంత గందరగోళం ఎదురవుతుంది. సూర్యకుమార్ యాదవ్‌ని మూడో స్థానంలో ఆడించాలి. ఆ స్థానంలో అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు. అతడిలో రిస్క్ తీసుకునే గొప్ప లక్షణముంది. టీ20 క్రికెట్లో రిస్క్ తీసుకోకపోతే రాణించలేం. అతడిని అలాగే కొనసాగించాలి’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ కోసం 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఐదు మంది ఓపెనర్లున్నారు. సీనియర్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటు, యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లకు అవకాశమిచ్చారు. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లను రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేసినా.. ఆల్ రౌండర్‌గా వెంకటేశ్ అయ్యర్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని