IND vs SA : చాహర్‌కు సమయం వచ్చింది.. భువి స్థానంలో తీసుకోవాలి: గావస్కర్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌నూ టీమ్ఇండియా చేజార్చుకుంది. అన్ని విభాగాల్లోనూ...
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌నూ టీమ్ఇండియా చేజార్చుకుంది. అన్ని విభాగాల్లోనూ దక్షిణాఫ్రికా ముందు టీమ్ఇండియా తేలిపోయింది. ఈ నేపథ్యంలో రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా (0/64, 0/67) పడగొట్టలేక విఫలమైన బౌలర్ భువనేశ్వర్‌కు బదులు దీపక్ చాహర్‌ను జట్టులోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునిల్ గావస్కర్ తెలిపాడు. ‘‘ భారత్ క్రికెట్‌కు భువనేశ్వర్ ఎంతో సేవ అందించాడు. అయితే గత కొన్నేళ్లు ఇటు జాతీయ స్థాయితోపాటు దేశవాళీలోనూ మెరుగ్గా రాణించలేకపోతున్నాడు. అతడు జట్టుకు భారంగా మారాడు. అద్భుతమైన యార్కర్లు, స్లో డెలివరీలను సంధించే భువనేశ్వర్ బౌలింగ్‌లో లయ కోల్పోయినట్లుగా ఉంది. ప్రత్యర్థులు తేలిగ్గా అంచనా వేసి పరుగులు రాబడుతున్నారు. అందుకే భువి స్థానంలో వేరొకరిని ఎంపిక చేసుకోవాలని అవసరం ఉంది. దీపక్ చాహర్ అయితే ఇటు బ్యాటింగ్‌లోనూ అక్కరకొస్తాడు. అందుకే 2023 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును సిద్ధం చేయాలి’’అని సూచించాడు.
ఓడిపోవడానికి అదే కారణం
టీమ్ఇండియా ఓడిపోవడానికి అతి విశ్వాసమే ప్రధాన కారణమని ప్రొటీస్ మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అభిప్రాయపడ్డాడు. ‘‘ ఎవరి ప్రదర్శనను జడ్జ్ చేయడం లేదు. భారత్ టాప్ టీమ్. దక్షిణాఫ్రికా ఇప్పుడిప్పుడే కుర్రాళ్లతో ఎదుగుతున్న జట్టు. అయితే సఫారీలను టీమ్ఇండియా తక్కువ అంచనా వేసిందని మాత్రం చెప్పగలను. అతివిశ్వాసానికి పోయి ఓటమిని కొనితెచ్చుకున్నారు. ఇదే ప్రధాన కారణంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్