IPL 2021: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మలి దశలో భాగంగా అబుదాబి వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) మధ్య ఈ మ్యాచ్‌ జరుగనుంది. టాస్‌ గెలిచిన..

Updated : 23 Sep 2021 19:20 IST

ఇంటర్నెట్ డెస్కు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మలి దశలో భాగంగా అబుదాబి వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ముంబయి ఇండియన్స్‌ (ఎంఐ), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మధ్య ఈ మ్యాచ్‌ జరుగనుంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైన ముంబయి.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు, బెంగళూరుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. మలి దశలో శుభారంభం చేసిన కోల్‌కతా అదే జోష్‌ను కొనసాగించాలనుకుంటోంది.  

ముంబయి ఇండియన్స్‌ జట్టు..

రోహిత్‌ శర్మ (కెప్టెన్), క్వింటన్‌ డి కాక్ ‌(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, సౌరభ్‌ తివారీ, కీరన్‌ పొలార్డ్, కృనాల్‌ పాండ్య, ఆడమ్‌ మిల్నే, రాహుల్‌ చాహర్‌, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు..

వెంకటేశ్‌ అయ్యర్, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తిక్‌ (వికెట్‌ కీపర్‌), ఆండ్రూ రస్సెల్‌, సునీల్‌ నరైన్, లాకీ ఫెర్గూసన్‌, వరుణ్‌ చక్రవర్తి, ప్రసిద్ధ్‌ కృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని