
KL Rahul: కివీస్‌తో టెస్టు సిరీస్.. రాహుల్ ఔట్
జట్టులోకి సూర్యకుమార్ యాదవ్
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు ఎదురు దెబ్బతగిలింది. న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఈ క్రమంలో కివీస్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను కూడా గెలుచుకోవాలని భావిస్తున్న టీమ్ఇండియాకు షాక్‌లాంటి వార్త. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయంతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వర్గాలు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయంతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని ట్వీట్ చేసింది. నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎడమ చేతి కండరాల సంబంధిత గాయంతో కేఎల్ రాహుల్ బాధపడుతున్నట్లు సమాచారం. అయితే దానిపై బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ కేఎల్ రాహుల్ పాల్గొనలేదు.
కివీస్‌తో తొలి టెస్టుకు కేఎల్ రాహుల్ గైర్హాజరు నేపథ్యంలో మయాంక్ అగర్వాల్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. అలానే రాహుల్‌కు బదులు సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో స్థానం దక్కింది. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తే మాత్రం.. రహానె, శ్రేయస్, వృద్ధిమాన్‌తో కలిసి భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ పర్యటనకు టీమ్ఇండియా జట్టుతోపాటు వెళ్లిన సూర్యకుమార్‌కు తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు మళ్లీ టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ విశ్రాంతి నేపథ్యంలో తొలి టెస్టుకు అజింక్యా రహానె సారథ్యం వహిస్తుండగా.. ఛెతేశ్వర్ పుజారా వైస్‌కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. రెండో టెస్టుకు (డిసెంబర్ 3-7) విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులోకి వచ్చేస్తారు. విరాట్ నాయకత్వంలోనే టీమ్ఇండియా రెండో టెస్టు మ్యాచ్‌ను ఆడనుంది.
తొలి టెస్టుకు భారత జట్టు:
అజింక్యా రహానె (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
► Read latest Sports News and Telugu News