Ravi Shastri:మౌనం వీడిన రవిశాస్త్రి..ఐదో టెస్టు రద్దుపై స్పందన 

మాంచెస్టర్‌ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్యసెప్టెంబర్ 10 నుంచి జరగాల్సిన ఐదో టెస్ట్‌  అర్దంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఐదో టెస్టుకు ముందు అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పార్మ‌ర్‌కు కూడా క‌రోనా సోక‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. అంతకుముందు నాలుగో

Published : 13 Sep 2021 01:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మాంచెస్టర్‌ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్యసెప్టెంబర్ 10 నుంచి జరగాల్సిన ఐదో టెస్ట్‌  అర్దంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఐదో టెస్టుకు ముందు అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు క‌రోనా సోక‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. అంతకుముందు నాలుగో టెస్టు జరుగుతున్నప్పుడు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ శ్రీధ‌ర్‌, ఫిజియో థెరపిస్ట్‌ నితిన్‌ పటేల్‌కు కొవిడ్ సోకింది. 

అయితే భారత శిబిరంలో కరోనా రావడానికి హెడ్‌ కోచ్​ రవిశాస్త్రి.. టీమ్‌ హోటల్లో జరిగిన తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడమే ప్రధాన కారణమని పలు వార్తా కథనాలు వచ్చాయి. ఈ పుస్తకావిష్కరణకు బీసీసీఐ అనుమతి లేకుండా ఇతర ఆటగాళ్లు హాజరయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కోచ్​ రవిశాస్త్రి తొలిసారి స్పందించాడు.

‘యూకే మొత్తం తెరిచారు. ఎక్క‌డా ఎలాంటి ఆంక్ష‌లు లేవు. జరిగేది ఉంటే తొలి టెస్ట్ నుంచే ఏదైనా జ‌రిగి ఉండొచ్చు’ అని ర‌విశాస్త్రి ఓ ఆంగ్ల పత్రికతో అన్నాడు. ఇంగ్లాండ్‌లో టీమ్ఇండియా ప్ర‌ద‌ర్శ‌న అద్భుతంగా ఉంద‌ని పేర్కొన్నాడు. ఈ కొవిడ్ స‌మ‌యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో ఏ ఇత‌ర జట్టు కూడా టీమ్‌ఇండియాలా ఆడ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని