IND vs SA : అతడిని జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్‌ సమస్య తీరినట్టే!: సంజయ్‌ మంజ్రేకర్‌

టీమ్‌ఇండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ని జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్ సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో...

Published : 20 Jan 2022 10:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ని జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్ సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 0-1తో వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో మంజ్రేకర్‌ స్పందించాడు.

‘టీమ్‌ఇండియాను గత కొద్ది కాలంగా మిడిలార్డర్‌ సమస్య వేధిస్తోంది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన రిషభ్‌ పంత్‌ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడం.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అరంగేట్ర ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌ విఫలం కావడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. అందుకే, మిడిలార్డర్‌లో సమర్థంగా రాణించగల సూర్యకుమార్‌ యాదవ్‌ని జట్టులోకి తీసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందనుకుంటున్నాను. దాంతో పాటు జట్టు కూర్పులో స్వల్ప మార్పులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాలను ఛేదించడం అంత సులభం కాదు. ప్రత్యేకించి వన్డే మ్యాచుల్లో అది మరింత కష్టం. ఎవరో ఒకరు బ్యాటింగ్‌ భారాన్ని మోయాల్సి ఉంటుంది. శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ జట్టుకి మెరుగైన ఆరంభం ఇచ్చినా.. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై భారత్‌ ఆశలు వదులు కోవాల్సి వచ్చింది’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని