Mary Kom: నన్ను క్షమించండి.. టోక్యోలో పతకం గెలవలేకపోయా! 

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలవలేకపోయినందుకు భారత బాక్సింగ్‌ స్టార్ మేరీ కోమ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పింది

Published : 18 Aug 2021 23:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలవలేకపోయినందుకు భారత బాక్సింగ్‌ స్టార్ మేరీకోమ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పింది. టోక్యోలో దేశం తరపున ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్లకు సోమవారం ప్రధాని తన అధికారిక నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పతక విజేతలతో పాటు మిగతా అథ్లెట్లతోనూ ఆయన మాట్లాడారు. ఈ మేరకు మేరీకోమ్‌ ప్రధానితో మాట్లాడుతూ.. ‘నన్ను క్షమించండి, నేను పతకం గెలవలేకపోయా’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విషయంపై ప్రధాని స్పందిస్తూ.. ‘గెలుపోటములు జీవితంలో భాగం. అలాగే క్రీడాప్రపంచంలోనూ అవి సహజమే. దేశం తరఫున మీరు  ప్రయత్నించారు. మీరు ఎంతో మంది మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. గత దశాబ్ద కాలంగా మీరు ఎంతో సాధించారు. ఇప్పుడు అందరి దృష్టి మీపైనే ఉంది’ అని అన్నారు. ప్రధాని ముందు ఇచ్చిన మాట ప్రకారం భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధూతో కలిసి ఐస్‌క్రీమ్‌ తిన్నారు. దేశానికి తొలి స్వర్ణాన్ని అందించిన నీరజ్‌ చోప్రాతో ముచ్చటించారు. రెండు ఒలింపిక్స్‌ పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా నిలిచిన సింధునూ ప్రత్యేకంగా ఆయన అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని