Covid: మిల్కాసింగ్‌ డిశ్చార్జి

లెజెండరీ భారత స్ప్రింటర్‌ మిల్కా సింగ్‌(91) , ఆయన భార్య నిర్మల మిల్కా సింగ్‌ ఇటీవల కరోనా బారినపడ్డారు.  అయితే, ఆదివారం మిల్కాసింగ్‌  ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు ఆయనను

Published : 31 May 2021 01:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల కొవిడ్‌ బారిన పడిన లెజెండరీ భారత స్ప్రింటర్‌ మిల్కా సింగ్‌ (91) ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు ఆయనను డిశ్చార్జి చేసినట్లు మొహాలీలో ఆయన చికిత్స తీసుకున్న ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అందులో పేర్కొంది. ఆక్సిజన్‌ అవసరం పెరగడంతో మిల్కా సింగ్‌ భార్యను శనివారం సాయంత్రం ఐసీయూకి తరలించామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని వెల్లడించింది. మిల్కా సింగ్‌కు ఈ నెల 20న కరోనా పాజిటివ్‌గా తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని